ముంబయ్ లో ఒమిక్రాన్ ఎక్స్ ఈ వేరియంట్ కేసు నమోదు

భారత్ లోనూ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. ఒమిక్రాన్ ఎక్స్ ఈ వేరియంట్ తొలి కేసు ముంబయ్ లో నమోదు అయింది. దీంతో కేంద్రం వెంటనే అప్రమత్తం అయింది. ప్రస్తుతం యూకేలో ఈ వేరియంట్ కేసులు భారీ ఎత్తున ఉన్న విషయం తెలిసిందే. అత్యంత వేగంగా విస్తరించే అవకాశం ఉన్న ఈ వేరియంట్ పై ఇటీవలే డబ్ల్యూహెచ్ వో హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకూ భారత్ లో ఈ కేసులు లేకపోవటంతో ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. తొలి కేసు ముంబయ్ లో వెలుగుచూడటంతో కలకలం ప్రారంభం అయింది.
ఈ కొత్త వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. దేశంలో ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినందున ఏ వేరియంట్ అయినా సరే దేశంలో పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదని నిపుణులు ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో బూస్టర్ డోసుకు సంబంధించి కూడా త్వరలోనే విధానం నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కరోనా పుట్టిన చైనాలోనూ ప్రస్తుతం భారీ ఎత్తున కేసులు నమోదు అవుతుండటంతో అక్కడ కీలక నగరాలు ప్రస్తుతం లాక్ డౌన్ లోకి వెళ్ళాయి.



