Telugu Gateway
Top Stories

బ్యాంకాక్ ఫ్లైట్ లో ఫైటింగ్

బ్యాంకాక్ ఫ్లైట్ లో ఫైటింగ్
X

ఈ మధ్య విమానాల్లో విచిత్ర సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఒక సారి విమానం వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా విమానం డోర్ తెరిచేందుకు చూస్తాడు. సిబ్బంది ఎలాగోలా కష్టపడి దాన్ని ఆపుతారు. ఇప్పుడు ఏకంగా ప్రయాణికులు విమానంలోనే కొట్టుకున్నారు. హాయిగా బ్యాంకాక్ లో తిరిగి ఇండియా కు వస్తూ వీళ్ళు ఫైటింగ్ కు దిగారు. వీళ్ళను ఆపేందుకు సిబ్బంది చాలా తంటాలు పడాల్సి వచ్చింది. నలుగురు ప్రయాణికులు బ్యాంకుకు నుంచి వస్తూ విమానం ఎక్కాక ఒక వ్యక్తితో గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి అందులోని ఒకరు తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నారు.

దీంతో లోపల ఉన్న వాళ్ళు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇది థాయ్ స్మైల్ విమానంలో చోటు చేసుకుంది. ఈ మొత్తాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఒకరు. ఈ ఘటనపై థాయ్ స్మైల్ ఎయిర్ లైన్స్ స్పందించి ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అదే సమయంలో తాము బాధితుడికి అవసరమైన సాయం చేశామని...భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నడుచుకున్నట్లు తెలిపారు.

Next Story
Share it