Telugu Gateway
Top Stories

ఉద్రిక్తంగా మారుతున్న రైతు ఆందోళనలు

ఉద్రిక్తంగా మారుతున్న రైతు ఆందోళనలు
X

రైతు చట్టాల వ్యవహారం కేంద్రంలోని మోడీ సర్కారుకు చిక్కులు తెచ్చిపెడుతోంది. డిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన దేశంలోనే కాకుండా..విదేశాల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది ఎన్డీయే సర్కారును . ఇది మరీ ఇబ్బందులకు గురిచేస్తోంది. రైతులు మాత్రం కేంద్రం తెచ్చిన చట్టాలు ఉపసంహరించాల్సిందేనని పట్టుపడుతున్నారు. అయితే కేంద్రం ఓ వైపు చట్టాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూనే మరో వైపు చర్చలు కొనసాగిస్తోంది. అయితే రైతుల ఆందోళనలు తొలగించేందుకు కేంద్ర మంత్రులు చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు.

అయితే గురువారం నాడు మరోసారి రైతు నాయకులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మరికొంత మంది చర్చలు సాగించనున్నారు. దీని కంటే ముందు అమిత్ షా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో భేటీ కానుండటంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఉద్యమ్యాన్ని ముందుండి నడిపిస్తున్నది పంజాబ్ రైతులే..తర్వాత వీరికి మరికొంత మంది కూడా తోడయ్యారు. దేశ వ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నా ఢిల్లీ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.

Next Story
Share it