Telugu Gateway
Top Stories

వివాదంలో అంబానీ తనయుడు!

వివాదంలో అంబానీ తనయుడు!
X

అనంత్ అంబానీ. ప్రపంచ సంపన్నుల జాబితాలో పదవ ప్లేస్ లో ఉన్న దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ చిన్న కొడుకు. అయన చేసిన పని ఒకటి దుమారం రేపుతోంది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇందులో ఒకటి మంచి ఉంటే..మరొకటి ఆయనపై విమర్శలకు కారణం అవుతుంది. ఇటీవల అనంత్ అంబానీ తన ప్రైవేట్ జెట్ లో కంపెనీ కి చెందిన ఒక ఉద్యోగి పుట్టిన రోజు వేడుకలు చేశారు. కేక్ కట్ చేయటంతో పాటు ఉద్యోగులు అందరితో ఎంతో కలిసిమెలసి ఉన్నారు. ఈ విషయానికి అనంత్ అంబానీ పై అందరు ప్రశంసలు కురిపించారు. మంచి బాస్....ఉద్యోగులతో ఎంతో ఫ్రెండ్లీ గా ఉన్నారు అంటూ ఆయనపై పొగడ్తలు కురిపించారు. కాసేపు ఈ సంగతి పక్కన పెడితే ఫ్లైట్ లో పుట్టిన రోజు చేసుకున్న వయసులో ఎంతో పెద్ద వ్యక్తి అనంత్ అంబానీ కి పాదాభివందనం చేశారు.

దీన్ని అనంత్ అంబానీ ఏ మాత్రం వారించక పోగా...ఆ పెద్దాయన వీపుపై కొట్టిన ఫోటోలు తీవ్ర విమర్శలకు కారణం అయ్యాయి. అనంత్ అంబానీకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇటీవలే రాధికా మర్చంట్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. వయసులో ఎంతో చిన్నవాడు అయిన అనంత్ అంబానీ ఆ పెద్ద వ్యక్తి పాదాభివందనం చేస్తుంటే వారించకపోవటం సరికాదు అంటూ నెటిజెన్ లు తప్పుపడుతున్నారు. మరికొంత మంది పుట్టిన రోజు చేసుకున్న పెద్దాయన తీరు కూడా సరిగా లేదన్నారు. చాలా కార్పొరేట్ కంపెనీ లు ఉద్యోగుల పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్ లు ఇవ్వటం , ఆఫీస్ లోనే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తుంటాయి.

Next Story
Share it