Telugu Gateway
Top Stories

టేకాఫ్ కోసం ఎమిరేట్స్ ఫ్లైట్ ని లాగిన జింకలు

టేకాఫ్ కోసం ఎమిరేట్స్ ఫ్లైట్ ని లాగిన జింకలు
X

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సంచలనం సృష్టించింది. క్రిస్మస్ సందర్భంగా ప్రయాణకులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. దీనికి సంబదించిన వీడియో విడుదల చేసిన గంటల సమయంలోనే వైరల్ గా మారింది. ప్రయాణికులకు క్రిస్మస్ శుభాకంక్షాలు తెలుపుతూ విలాసవంతమైన సౌకర్యాలు ఉండే డబల్ డెక్కర్ విమానం ఏ 380 ముందు భాగంలో శాంతా టోపీని పెట్టింది. అంతే కాదు అతిపెద్దది అయినా ఈ ఏ 380 విమానాన్ని టేక్ ఆఫ్ కు దృవపు జింకలు లాగినట్లు ఒక యానిమేటెడ్ వీడియో ను సిద్ధం చేసి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఇది పెట్టిన కొన్ని గంటల్లోనే దీనికి పెద్దఎత్తున అభినందలు దక్కాయి. ఈ వీడియో చూస్తే నిజంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ కోసం జింకలు లాగినట్లు కనిపిస్తుంది. ఈ క్రిస్మస్ సీజన్ తో పాటు మొత్తం డిసెంబర్ నెలలో 14 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని ఎమిరేట్స్ అంచనా. క్రిస్మస్ తో పాటు నూతన ఏడాది ప్రయాణికుల కోసం ఈ ఎయిర్ లైన్స్ పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రమోషన్ యాడ్స్ కూడా వినూత్నంగా ఉంటాయి. విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఆ విడియోలోనిదే ఐటీల్లో పెట్టిన ఫోటో కూడా.

దృవపు జింక

Next Story
Share it