ఎలాన్ మస్క్ సంపద ఎనిమిది లక్షల కోట్లు మటాష్
ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ దెబ్బ మాములుగా లేదు. ఎందుకంటే ఒక్క ఏడాదికాలంలోనే అయన సంపద ఏకంగా ఎనిమిది లక్షల కోట్లు మటాష్ అయింది. 2022 సంవత్సరంలో మస్క్ సంపద వంద బిలియన్ డాలర్లు కోల్పోయారు. అది భారతీయ కరెన్సీలో అయితే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పైమాటే. మస్క్ సంపద ఇంత భారీ స్థాయిలో తగ్గటం ఇదే మొదటి సారి. ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ షేర్లు 2020 నవంబర్ నుంచి ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 170 బిలియన్ డాలర్స్ గా ఉంది. ఏడాది క్రితం ఇది గరిష్ట స్థాయిలో అంటే 340 బిలియన్ డాలర్స్ వద్ద ఉంది. ఈ ఒక్క ఏడాదిలోనే టెస్లా షేర్స్ 52 శాతం పతనం అవ్వటం విశేషం. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు దిశగా అడుగులు ప్రారంభించగానే టెస్లా షేర్స్ పతనం ఇవ్వటం ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా అంతా గందర గోళం నెలకొని ఉంది. ఉద్యోగుల తొలగింపు...బ్లూ టిక్ కొనసాగిపు పై పూటకో మాట మాట్లాడం...యాడ్స్ నిలిచిపోవటం వంటి అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.