Telugu Gateway
Top Stories

ఎలాన్ మస్క్ కే చుక్కలు చూపిస్తున్నాడు

ఎలాన్ మస్క్ కే చుక్కలు చూపిస్తున్నాడు
X

జాక్ స్వీని. ఓ కాలేజీ స్టూడెంట్. అతడు చేసే పనులు చాలా మందికి చికాకు తెప్పిస్తున్నాయి. . ఇంతకు ఏమి చేస్తాడు అంటారా..సంపన్నుల ప్రైవేట్ జెట్స్ ఎక్కడెక్కడుకు వెళుతున్నాయనే విషయాలను ట్రాక్ చేస్తాడు అతడు. నిన్నమొన్నటి వరకు ప్రపంచంలో నెంబర్ వన్ సంపన్నుడుగా ఉన్న టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కే చుక్కలు చూపించాడు ఈ కుర్రోడు. అతగాడి ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా బ్లాక్ చేసిన సరే అతడు తన పని ఏ మాత్రం ఆపలేదు. 2022 సంవత్సరం లో ఎలాన్ మస్క్ ప్రైవేట్ జెట్ ఎన్ని సార్లు ఎక్కడెక్కడుకు వెళ్ళింది మొత్తం వివరాలు బయటపెట్టాడు. అతడు ఫ్లైట్ ట్రాక్ చేస్తాడు. అయితే ఆ ప్రైవేట్ జెట్ వెళ్లిన ప్రతిసారి అందులో ఎలాన్ మస్క్ ఉన్నారా లేదా అన్న అంశంపై క్లారిటీ లేదు. కానీ మస్క్ ప్రైవేట్ జెట్ గత ఏడాది మొత్తం 134 సార్లు ప్రయాణించింది అందులో అతి తక్కువ ప్రయాణ సమయం ఆరు నిముషాలు కాగా, అతి ఎక్కువ సమయం సాగిన ప్రయాణం పన్నెండు గంటల ఇరవై నిముషాలు.

2020 సంవత్సరం నుంచి స్వీని ఈ ఫ్లైట్ ట్రాకింగ్ స్టార్ట్ చేశాడు. గత ఏడాది డిసెంబర్ లో ఎలాన్ మస్క్ ఖతార్ లో సాకర్ వరల్డ్ కప్ లో పాల్గొన్న ప్రయాణానికి సంబదించిన డేటా కూడా తాజాగా విడుదలైన డేటా లో ఉంది. ఎలాన్ మస్క్ విమానం మైకోనోస్, గ్రీస్, ఆస్టిన్, టెక్సాస్ లు ఉన్నాయి. అయితే బయటకు వచ్చిన వివరాల ప్రకారం ఎలాన్ మస్క్ లాస్ ఏంజెల్స్, ఆస్టిన్, టెక్సాస్ లోని బ్రౌన్స్విల్లే కు ఎక్కువగా ప్రయాణించినట్లు చూపుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో స్వీని కి మస్క్ ఒకరకంగా వార్నింగ్ ఇచ్చారు. లైవ్ లొకేషన్స్ షేర్ చేయటం ద్వారా తన రెండేళ్ల కుమారుడిని ప్రమాదంలోకి నెట్టారని, ఆయనపై దావా వేస్తానని మండిపడ్డారు. అయితే ఇదేమి స్వీని పై పెద్ద గా ప్రభావం చూపించినట్లు కనిపించటం లేదు.

Next Story
Share it