Telugu Gateway
Top Stories

తెలివి తక్కువ వాడు దొరగ్గానే తప్పుకుంటా

తెలివి తక్కువ వాడు దొరగ్గానే తప్పుకుంటా
X

ఈ ఏడాది ఎక్కువ వార్తల్లో ఉన్న వ్యక్తుల్లో ఎలాన్ మస్క్ కూడా ఖచ్చితం గా ఉంటారు. నిన్న మొన్నటి వరకు అయన ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఉండటం ఒకటి అయితే..ట్విట్టర్ కొనుగోలు ద్వారా కూడా ప్రపంచం అంతా తన వైపు తిరిగేలా చేసుకున్నారు. ఇప్పుడు ఎలాన్ మాస్క్ అంటేనే నిత్యం ఏదో ఒక వివాదం. కారణం ఏది అయినా అయన మాత్రం వార్తల్లోని వ్యక్తిగా మారారు. ట్విట్టర్ దెబ్బకు టెస్లా షేర్లు కుప్పకూలడంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో ఫస్ట్ ప్లేసును పోగొట్టుకున్నారు. . ఇప్పుడు అయన రెండవ స్థానంలో ఉన్నారు. భారతీయ కరెన్సీ లో దాదాపు మూడున్నర లక్షల కోట్లు పెట్టి అయన ట్విట్టర్ కొన్నారు. అయినా సరే ట్విట్టర్ యూజర్లు ఎలాన్ మస్క్ మీద ఏ మాత్రం సానుభూతి చూపలేదు.

అసలు ఆయనపై యూజర్లు సానుభూతి చూపాల్సిన పని ఏమిటి అంటారా....తాజాగా మస్క్ ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టిన విషయం తెలిసిందే. అది ఏంటి అంటే ట్విట్టర్ సీఈఓ గా తాను కొనసాగాలా వద్ద అని..అంతే 57 .5 శాతం మంది వద్దు పొమ్మన్నారు. దీంతో ముందు చెప్పినట్లుగానే ట్విట్టర్ సీఈఓ కి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే ఈ బాధ్యతలు తీసుకొనే తెలివి తక్కువ వ్యక్తి దొరకాలని కామెంట్ చేయటం ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. అయితే కొత్త సీఈఓ నియామకం ఎప్పటిలోగా పూర్తి అవుతుంది అనే అంశంపై స్పష్టత లేదు. సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నాక సాఫ్ట్వేర్ ..సర్వర్ల బాధ్యతలు మాత్రం తానే చూసుకుంటానని తెలిపారు.



Next Story
Share it