Telugu Gateway
Top Stories

ఎలాన్ మస్క్ మళ్ళీ నెంబర్ వన్

ఎలాన్ మస్క్ మళ్ళీ నెంబర్ వన్
X

టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తిరిగి ప్రపంచ నెంబర్ వన్ సంపన్నుడు అయ్యారు. కొద్ది రోజుల క్రితం అయన ఈ హోదాను కోల్పోయిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో టెస్లా షేర్లు భారీ స్థాయిలో పెరగటంతో ఇది సాధ్యం అయింది. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 187 బిలియన్ అమెరికన్ డాలర్లు గా ఉంది. అదే భారతీయ కరెన్సీలో చూస్తే పదిహేను లక్షల ముప్పైమూడు వేల నాలుగువందల కోట్ల రూపాయలు. గత ఏడాది డిసెంబర్ లో విలాసవంతమైన వస్తువుల కంపెనీ ఎల్ వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్ ఫస్ట్ ప్లేసుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఎలాన్ మస్క్ ఇప్పుడు తిరిగి ఫస్ట్ ప్లేస్ కు రావటం తో బెర్నార్డ్ అర్నాల్ట్ రెండవ ప్లేస్ కు వెళ్లారు. ఇప్పుడు అయన సంపద 185 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఇద్దరి మధ్య గ్యాప్ కేవలం రెండు బిలియన్ డాలర్లు మాత్రమే కావటం విశేషం.

ఎలాన్ మస్క్,బెర్నార్డ్ అర్నాల్ట్ ల తర్వాత ప్రపంచ సంపన్నుల జాబితాలో జెఫ్ బెజోస్ (117 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్ (114 బిలియన్ డాలర్లు ) ఉన్నారు. తర్వాత జాబితాలో వారెన్ బఫెట్, లారి ఎల్లిసన్, స్టీవ్ బామర్ , లారి పేజీ, ముఖేష్ అంబానీ లు ఉన్నారు. 81 .1 బిలియన్ డాలర్ల తో ముఖేష్ అంబానీ ఈ జాబితాలో పడవ స్థానాల్లో నిలిచారు. సరిగా నెల రోజుల క్రితం ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడవ స్థానానికి ఎగబాకిన గౌతమ్ అదానీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నివేదికతో టాప్ టెన్ లోనే కాదు...ఇప్పుడు టాప్ ట్వంటీ లో కూడా లేకుండా పోయారు. కేవలం 24 ట్రేడింగ్ సెషన్ల లో అదానీ సంపద 12 . 37 లక్షల కోట్ల మేర హరించుకు పోయింది. మంగళవారం నాడు కూడా అదానీ గ్రూప్ కంపెనీ ల షేర్లు నష్టాలతోనే కొనసాగుతున్నాయి.

Next Story
Share it