Telugu Gateway
Top Stories

వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ పొంద‌టం ఇప్పుడు మ‌రింత తేలిక‌

వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ పొంద‌టం ఇప్పుడు మ‌రింత తేలిక‌
X

చాలా మందికి రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్త‌యినా వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్లు పొంద‌టంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోవిన్ యాప్ లో ర‌క‌ర‌కాల స‌మస్య‌లు వ‌స్తున్నాయి. అయితే కేంద్రం ఈ స‌మ‌స్య‌ల‌కు ముగింపు ప‌లికేందుకు కొత్త మార్గాన్ని అన్వేషించింది. ఒక్క వాట్స‌ప్ నెంబ‌ర్ కు మెసేజ్ చేయ‌టం ద్వారా స‌ర్టిఫికెట్ ను తేలిగ్గా పొంద‌వ‌చ్చ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌నుసుక్ మాండవీయ‌ వెల్ల‌డించారు. My gov corona helpdesk ద్వారా వాట్స‌ప్ కు మెసెజ్ పంపి కొన్ని క్షణాల్లో స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చ‌న్నారు.దీనికి అనుస‌రించాల్సిన ప‌ద్ద‌తులు ముందు ఫోన్ లో 90131 51515 పోన్ నెంబ‌ర్ ను సేవ్ చేసుకోవాలి. కోవిడ్ స‌ర్టిపికెట్ అని టైప్ చేసి ఆ నెంబర్ కు పంపాలి.

అక్క‌డ నుంచి వ‌చ్చే ఓటీపీ నెంబ‌ర్ ను ఎంట‌ర్ చేయాలి. వెంట‌నే వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ వ‌స్తుందని మంత్రి తెలిపారు. దేశంలో ఇప్ప‌టికే 50 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యింది. రాబోయే రోజుల్లో ఇది మ‌రింత ఊపందుకునే అవ‌కాశం ఉంది. దేశీయంగా మ‌రికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండ‌టం ఒకెత్తు అయితే కేంద్రం ఇటీవ‌లే జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి మంజూరు చేసిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it