Telugu Gateway
Top Stories

ఎంబెడెడ్ చిప్ప్ తో ఈ పాస్ పోర్టులు

ఎంబెడెడ్ చిప్ప్ తో ఈ పాస్ పోర్టులు
X

ఈ-పాస్ పోర్టుల‌కు సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్ లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎంబెడెడ్ చిప్ప్ తో ఈ పాస్ పోర్టులు 2022-23 ఆర్ధిక సంవ‌త్స‌రం నుంచి అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు. దేశ పౌరులు..ముఖ్యంగా ప్ర‌యాణికుల‌కు మ‌రింత సౌల‌భ్యంగా ఉండేలా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. కొత్త‌గా జారీ చేయ‌నున్న ఈ పాస్ పోర్టుల్లో ప్ర‌యాణికుడికి సంబంధించిన వ్య‌క్తిగ‌త వివ‌రాల‌తోపాటు స‌మాచారం అంతా నిక్షిప్తం చేయ‌నున్నారు. దీని వ‌ల్ల ఆయా వ్య‌క్తుల వివ‌రాల ప‌రిశీల‌న మ‌రింత సుల‌భంగా పూర్తి కావ‌టంతోపాటు వేగంగా అవుతుంద‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే అంత‌ర్జాతీయంగా ప‌లు దేశాలు ఈ పాస్ పోర్టుల దిశ‌గా ముంద‌డు వేశాయి. భ‌విష్య‌త్ లో ప‌లు దేశాలు ఇదే బాట‌లో ప‌య‌నించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు. కొత్త‌గా వ‌చ్చే ఈ పా్స్ పోర్టులు డ్రైవింగ్ లైసెన్స్ ల త‌ర‌హాలో ఉంటాయ‌ని..ఇందులో చిప్ ఉంటుంది. స‌మ‌స్త స‌మాచారం ఇందులో నిక్షిప్తం చేస్తారు. ఈ పాస్ పోర్టుల ద్వారా ఫేక్ పాస్ పోర్టుల స‌మ‌స్య కూడా త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు.

Next Story
Share it