Telugu Gateway
Top Stories

దుమ్ము రేపుతున్న దుబాయ్ విమానాశ్రయం

దుమ్ము రేపుతున్న దుబాయ్ విమానాశ్రయం
X

ప్రపంచంలోని అత్యంత బిజీ విమానాశ్రయాల్లో దుబాయ్ ఒకటి. ఇక్కడకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు...వ్యాపార నిమిత్తం వచ్చేవారు ఉంటారు. కరోనా తర్వాత ఇప్పుడు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దుమ్ము రేపుతోంది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఈ విమానాశ్రయం కరోనా కంటే ముందు ఉన్న ప్రయాణికుల సంఖ్యను దాటింది. అంటే 2002 జులై -సెప్టెంబర్ నెలల్లో 18 5 మిలియన్ల మంది (కోటి ఎనభై ఐదు లక్షల మంది ) ప్రయాణికులు ఇక్కడకు చేరుకున్నారు. కరోనా రాక ముందు అంటే 2020 మొదటి త్రైమాసికంలో ఈ సంఖ్య 17.8 మిల్లియన్లగా ఉంది. తాజా లెక్కలతో ఈ ఏడాది దుబాయ్ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల సంఖ్యలో మార్పులు చేశారు కూడా. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ప్రతి నెలా దుబాయికి వచ్చే వారి సంఖ్య అరవై లక్షల పైనే ఉంటోంది. తాము అనుకున్న దానికంటే రికవరీ వేగంగానే ఉందని దుబాయ్ ఎయిర్ పోర్ట్ వర్గాలు చెపుతున్నాయి. 2022 ఏడాది మొత్తంలో దుబాయ్ విమానాశ్రయానికి మొత్తం 64 .3 మిలియన్ల మంది వస్తారని లెక్కలు వేస్తున్నారు.

Next Story
Share it