డ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
కీలక పరిణామం. సంచలనం రేపిన ముంబయ్ క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు మాదక ద్రవ్యాల నియంత్రణ కార్యాలయం (ఎన్ సీబీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో ఆయన ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని తెలిపారు. ఇదే కేసులో వాట్సప్ చాట్..ఇతర ఆధారాల కారణంగా ఆర్యన్ ఖాన్ తోపాటు మరికొంత మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులోఆర్యన్ ఖాన్ కొన్ని రోజులు జైలు జీవితం గడిపి.బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిన తెలిసిందే.
పక్కా స్కెచ్ వేసి మరీ తాము క్రూయిజ్ లో డ్రగ్స్ పార్టీని తాము బట్టబయలు చేశామని..ఇందులో చాలా మంది కీలక వ్యక్తులు ఉన్నారని అంటూ అప్పట్లో ప్రకటించింది. ఇందులో షారుఖ్ ఖాన్ కొడుకు ఉండటంతో ఇది దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అప్పట్లో బాలీవుడ్ ను కేంద్రం టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించిన విషయం తెలిసిందే. ముంబయ్ నుంచి టాలీవుడ్ ను ఉత్తరప్ర,దేశ్ కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత అంతా సద్దుమణిగింది. ఇప్పుడు సంచలనం రేపిన డ్రగ్స్ కేసు నుంచి కూడా ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది.