కొత్త కేసులు..మరణాల్లో తగ్గుదల నమోదు
కరోనా రెండవ దశ మహమ్మారి నుంచి భారత్ కొంచెం కొంచెం ఊరట పొందుతున్నట్లే కన్పిస్తోంది. గత కొన్ని రోజుల పాటు వరసగా దేశంలో కరోనా కేసులు నాలుగు లక్షలు దాటగా..ఇప్పుడు అవి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. శుక్రవారం నాటి గణాంకాల్లోనూ దేశ వ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదు అయింది. అదే సమయంలో మరోసారి యాక్టీవ్ కేసుల సంఖ్యను రికవరీ కేసులు దాటడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. మరణాల సంఖ్య కూడా ఒకింత తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే పరిణామమే. అయితే దేశ వ్యాప్తంగా ఇఫ్పటివరకూ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 18 కోట్లు దాటింది.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,26,098 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,890 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 3,53,299 మంది బాధితులు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,43,72,907 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం 36,73,802 మందికి చికిత్స కొనసాగుతుంది. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న బాధితులు 2,04,32,898 మంది. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 2,66,207 మంది మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.83 శాతం ఉండగా, మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. .