Telugu Gateway
Top Stories

మద్యం బాటిల్స్ లో 20 కోట్ల రూపాయల డ్రగ్స్

మద్యం బాటిల్స్ లో 20 కోట్ల రూపాయల డ్రగ్స్
X

కొత్త ఎత్తులు. ఎక్కడ దొరక్కుండా ఉండేందుకు ఎన్నో మార్గాలు. అయినా పట్టివేత. స్మగ్లర్ స్మార్ట్ గా మారితే వాళ్ళను పట్టుకునేవాళ్ళు మరింత స్మార్ట్ మారుతారు కదా. ఇప్పుడు ముంబై విమానాశ్రయంలో కూడా అదే జరిగింది. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు 20 కోట్ల రూపాయల విలువైన కొకెయిన్ లిక్విడ్ ను మద్యం బాటిల్స్ లో తెచ్చారు. వీళ్ళను డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. రెండు విస్కీ బాటిల్స్ లో స్ముగ్లర్స్ కొకెయిన్ ను ద్రవంగా మర్చి తెచ్చారు. ఈ బాటిల్స్ లో నిషేదిత మత్తు పదార్దాలు ఉన్నాయని గుర్తించి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నైజీరియా లోని లాగోస్ నుంచి అనుమానితుడు ఈ బాటిల్స్ తీసుకుని వచ్చాడు. సీజ్ చేసిన ఈ లిక్విడ్ కొకెయిన్ బరువు 3 .5 కిలోలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా ఈ మద్యం సీసాల్లో ఉన్న మత్తు పదార్దాలను గుర్తించారు. డీఆర్ఐ ఏర్పాటు చేసుకున్న నెట్ వర్క్ ద్వారా వచ్చిన ముందస్తు సమాచారం ఆధారంగా వీటిని స్వాధీనం చేసుకోగలిగారు. మాములుగా అయితే బాటిల్స్ లో ఉన్న కొకెయిన్ ను కనిపెట్టడం అంత సులభం కాదని...డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళు నిత్యం కొత్త కొత్త ఎత్తులు వేస్తూ అక్రమ రవాణా మార్గాలను వెతుకుతున్నారని అధికారులు తెలిపారు.

Next Story
Share it