Telugu Gateway
Top Stories

డబుల్ మాస్క్ మార్గదర్శకాలు

డబుల్ మాస్క్ మార్గదర్శకాలు
X

నిన్న మొన్నటివరకూ మాస్క్ మస్ట్ అన్నారు. ఇప్పుడు అందరి నోటా విన్పించే పదం 'డబుల్ మాస్క్'. ఒక్క మాస్క్ పోయింది..ఇప్పుడు రెండు మాస్క్ లు పెట్టుకుంటే తప్ప సేఫ్ కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బయట తిరిగేవారు..రద్దీ ప్రదేశాలకు వెళ్ళటం తప్పనిసరి అయితే డబుల్ మాస్క్ పెట్టుకుని తీరాల్సిందేనని..లేకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే డబుల్ మాస్క్ కూడా ఎలా పడితే అలా కాకుండా దాన్ని కూడా ఓ పద్దతి ప్రకారం వాడాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. డబుల్‌ మాస్క్‌ వేసుకోవడంతో కొంతమేరకు వైరస్‌ వ్యాప్తి జరిగే ప్రభావాన్ని తగ్గించవచ్చునని తేలింది.

ఒకే రకమైన రెండు మాస్క్‌ లను డబుల్‌ మాస్క్‌ గా వాడొద్దని కేంద్రం స్పష్టం చేసింది. డబుల్‌ మాస్క్‌ ను ధరించేటప్పుడు సర్జికల్‌ మాస్క్‌, క్లాత్‌ మాస్క్‌ కలిపి ధరించాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా ఒకే మాస్క్‌ ను వరుసగా రెండ్రోజులు పాటు వాడొద్దని కేంద్రం తెలిపింది. సాధారణ క్లాత్‌మాస్క్‌ 42 నుంచి 46 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని అధ్యయనకారులు వెల్లడించారు. సర్జికల్‌ మాస్కు అయితే 56.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్‌ మాస్కుపై క్లాత్‌మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు.

Next Story
Share it