ఇరవై సంవత్సరాల్లో ప్రధాని గా కెటీఆర్ !
ఈ మాట అన్నది ఎవరో తెలుసా?. ఆషా జడేజా మోత్వాని. ఆమె అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉండే ఏంజెల్ ఇన్వెస్టర్. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్నారు. అక్కడే తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ తో సమావేశం అయ్యారు.అనంతరం ఆమె ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. అందులో మంత్రి కెటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
20 సంవత్సరాల తర్వాత కెటీఆర్ భారత ప్రధాని అయితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. దావోస్ లో తెలంగాణ టీమ్ కసితో పనిచేస్తోందని, ఇలాంటి స్పష్టత, విజన్ ఉన్న యువ రాజకీయ నేతను ఇంత వరకూ చూడలేదన్నారు. తనకు వాళ్ళు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ ను గుర్తుచేశారన్నారు. తెలంగాణ టీమ్ బిలియన్ డాలర్ల ఒప్పందాలతో వెనక్కి వెళతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.