అమెరికాకు అవమానం..జో బైడెన్ కు 14 వరసలో సీటు!

దీనికి సంబంధించిన ఫోటోలను తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ లో పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. రెండేళ్లలో అమెరికా పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చూడండి..తాను ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను అమెరికా ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే ఇలా వెనక వరసలో కూర్చోపెట్టేవారు కాదన్నారు. రియల్ ఎస్టేట్ అయినా..రాజకీయాలైనా..జీవితం అయినా లొకేషన్ చాలా ముఖ్యం అంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. తాను ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే అమెరికా ఇప్పుడున్న దాని కంటే మెరుగ్గా ఉండేదని..ఇప్పుడు మాత్రం ప్రపంచ వేదికపై అమెరికాకు సరైన గౌరవం దక్కటంలేదన్నారు.