టీవీకే సంచలన విజయం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్నో సంచలనాలు నమోదు అయ్యాయి. గెలుస్తుంది అనుకున్న పార్టీ ఓడిపోవటమే కావటమే కాదు..ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఎమ్మెల్యేగా పైగా ఓటమి పాలు అయ్యారు. ఇది ఆయనకు...డీఎంకే కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఓటమి చెందింది కూడా విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో. ఏకంగా 9000 ఓట్ల తేడాతో స్టాలిన్ ఓటమి చవిచూశారు. కొళత్తూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచిన ఆయన ఈ సారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే పార్టీ పెట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించిన టీవీకె అధినేత విజయ్ మాత్రం పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. పెరంబూరు, తిరుచ్చిలో విజయ్ మంచి మెజారిటీ తో విజయాన్ని నమోదు చేశారు.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చెపాక్-తిరువల్లికేణి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. స్టాలిన్ కు ఇది కొంతలో కొంత ఊరట కలిగించే ఫలితం అని చెప్పొచ్చు. ఎందుకంటే డీఎంకే భవిష్యత్ లీడర్ గా ప్రచారంలో ఉన్న ఉదయనిధి కూడా పరాజయం పాలు అయి ఉంటే పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యేది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించినా కూడా మేజిక్ ఫిగర్ అయిన 118 సీట్లకు కొద్ది దూరంలో ఆగిపోయారు. దీంతో ఎవరితో కలిసి విజయ్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే కు 72 సీట్లు వస్తే...ఏఐఏడీఎంకె కు 53 సీట్లు వచ్చాయి. ఇతరులు ఒక సీట్ దక్కించుకున్నారు.



