అందరి టార్గెట్ ఉద్యోగులే
BY Admin9 Feb 2023 10:21 AM IST
X
Admin9 Feb 2023 10:21 AM IST
అందరి టార్గెట్ అద్యోగులే. ఖర్చు తగ్గించుకోవటానికి ఎంచుకునే మొదటి మార్గం ఇదే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ సంస్థలు అన్నీ గత కొన్నిరోజులుగా ఉద్యోగులను తొలగిస్తూ పోతున్నాయి. ఇప్పుడు డిస్నీ వంతు వచ్చింది. తమ స్ట్రీమింగ్ బిజినెస్ ను లాభదాయకంగా మార్చుకోవటానికి..ఖర్చు తగ్గించుకోవటాని ప్రపంచ వ్యాప్తంగా 7000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. సవాళ్ల తో కూడిన వాతావరణంలో తాము మరింత సమర్దవంతంగా పని చేయటానికి ఇది అవసరం అని డిస్నీ సీఈఓ బాబ్ ఇగెర్ వెల్లడించారు. తొలగించే ఉద్యోగులు మొత్తం కంపెనీలో దాదాపు నాలుగు శాతానికి సమానం. ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇదే బాట పట్టే అవకాశం ఉండనే వార్తలు వస్తున్నాయి.
Next Story