Telugu Gateway
Top Stories

రన్ వే ను తాకుతున్న ఇండిగో విమానాల తోకలు

రన్ వే ను తాకుతున్న ఇండిగో విమానాల తోకలు
X

దేశీయ విమానయాన రంగంలో మార్కెట్ వాటా పరంగా నంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఇండిగో ఎయిర్ లైన్స్. తాజగా ఇండిగో కు డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసిఏ) 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. దీనికి ప్రధాన కారణం గత ఆరు నెలల కాలంలో నాలుగు సార్లు ఇండిగో విమానాలకు చెందిన తోక భాగం రన్ వే లను తాకటమే. వరస ఘటనలతో డీజీసిఏ దీనిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. ఈ ఆడిట్ లో శిక్షణ, ఇంజనీరింగ్, ఫ్లైట్ డేటా మానిటరింగ్ కార్యాకలాపాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ లో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సవరించుకోవాలి అని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆదేశించింది. అదే సమయంలో జరిమానా కూడా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇండిగో వివరణ తీసుకుంది.

అది సంతృప్తికరంగా లేకపోటంతో జరిమానా విధిస్తూ భత్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయాలని ఆదేశించారు. ఇండిగో కు చెందిన ఏ 321 విమానాల తోక భాగాలు రన్ వే ను తాకాయి. విమానాల టేకాఫ్, లాండింగ్ సమయంలోనే విమానం వెనక భాగం రన్ వే ను తాకుతుంది. ఇండిగో విమానాల విషయంలో జరిగిన ఘటనలు అన్నీ కూడా లాండింగ్ సమయంలో జరిగినవే..అది కూడా పైలట్ ల పొరపాటువల్ల అని చెపుతున్నారు. ఇలా తోక భాగం రన్ వే కు తాకటం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని నిపుణులు చెపుతున్నారు.

Next Story
Share it