అమెరికా..యూకెలను వణికిస్తున్న డెల్టా వేరియంట్
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో కోలుకుంటున్న అమెరికా డెల్టా వేరియంట్ కరోనా విషయంలో ఆందోళన చెందుతోంది. దీనిపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు. ముఖ్యంగా ఇది 12-20 సంవత్సరాల పిల్లల్లో వేగంగా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వయస్సు వారు వెంటనే వ్యాక్సిన్ వేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు అంటోనీ పౌచీ సైతం డెల్టా వేరియంట్ కరోనాపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో నమోదు అవుతున్న కేసుల్లో ఆరు కేసులు డెల్టా వేరియంట్ వే అన్నారు.
యూకెలో నమోదు అవుతున్న కేసుల్లో 60 శాతం డెల్టా వేరియంట్ వే అన్నారు. అయితే యూకె తరహాలో అమెరికాలో జరగనీయబోమని ప్రకటించారు. అమెరికా వ్యాక్సినేషన్ విషయంలో టార్గెట్ పెట్టుకుని మరి ముందుకు సాగుతోంది. జులై నాటికి కూడా కొత్త టార్గెట్లు పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తోంది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న దశలో మధ్యమధ్యలో ఈ కొత్త వేరియంట్ల రాక..వేగం వంటి అంశాలను మళ్లీ ప్రజలను భయాందోళలనకు గురిచేస్తున్నాయని చెప్పొచ్చు.