Telugu Gateway
Top Stories

విమానం ముక్కలు అవుతుందనుకున్నారు

విమానం ముక్కలు అవుతుందనుకున్నారు
X

వర్షాలు ఇండియా లో కార్లను ముంచుతున్నాయి. ఢిల్లీ కి సమీపంలో ఉన్న నోయిడా లో అయితే పార్కింగ్ లో ఉన్న వందల కార్లు మునిగిపోయాయి. హైదరాబాద్ లో కూడా వరస వర్షాలతో ఖరీదు అయిన కార్లు కూడా మునిగిపోయాయి. వీటి రిపేర్లకు లక్షల మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని గగ్గోలు పెడుతున్నారు. ఇండియా లో పరిస్థితి ఇలా ఉంటే అమెరికాలో అయితే వర్షాల దెబ్బకు విమానాలు కూడా పగిలిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం వర్షాల దెబ్బకు వేల సంఖ్యలో విమానాలు రద్దు చేశారు. తాజాగా అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఒకటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. ఇటలీ లోని మిలన్ నుంచి న్యూ యార్క్ కు బయలు దేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే వణికిపోయింది. మిలన్ లో బయలుదేరిన పదిహేను నిమిషాల తర్వాత పెద్ద ఎత్తున వడగళ్ళు, పిడుగులు పడటం స్టార్ట్ అయ్యాయి. ఆ సమయంలో విమానంలో 215 మంది ప్రయాణికులు, ఏమినిది మంది సిబ్బంది ఉన్నారు.

వడగళ్ల దెబ్బకు అసలు ఇందులో ఉన్న ప్రయాణికులు అసలు తాము ఈ విమానం నుంచి బయటపడమని ఏ మాత్రం ఊహించలేదు. ఎందుకంటే విమానం రెక్కలతో పాటు విమానం ముక్కు భాగం కూడా దారుణంగా దెబ్బతిన్నది. అయిన కూడా ఈ సంక్షోభ సమయంలో పైలట్ అత్యవసరంగా దీని రోమ్ లో ల్యాండ్ చేశారు. దీంతో ఇందులో ఉన్న ప్రయాణికులు అంతా బతుకుజీవుడా అంటూ ఒప్పిరిపీల్చుకున్నారు. దెబ్బ తిన్న విమానాన్ని చూసి ఇందులో నుంచి తాము సేఫ్ గా బయటపడటం అదృష్టమే అంటూ ఈ ఫోటో లను సోషల్ మీడియా లో షేర్ చేశారు కొంత మంది. వడగళ్ల వానలో ఈ విమానాన్ని నియంత్రించటానికి పైలట్ లో ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఒక దశలో విమానం ముక్కలు అవుతుంది అని భయపడినట్లు ప్రయాణికులు వెల్లడించారు. ఈ ఫోటో లు చూస్తే కూడా ఇది ఎంత డ్యామేజ్ అయిందో కళ్ళకు కట్టినట్లు తెలుస్తోంది.

Next Story
Share it