Telugu Gateway
Top Stories

కొత్త రికార్డు క్రియేట్ చేయ‌నున్న ఢిల్లీ విమానాశ్ర‌యం

కొత్త రికార్డు క్రియేట్ చేయ‌నున్న ఢిల్లీ విమానాశ్ర‌యం
X

దేశంలోనే నాలుగు ర‌న్ వేలు ఉన్న విమానాశ్ర‌యంగా ఢిల్లీలోని ఇంధిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (ఐజీఏ) నిల‌వ‌నుంది. ఈ నాల‌గ‌వ ర‌న్ వే 2023 సంవ‌త్స‌రం ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టికే ఈ ర‌న్ వే ప్రాంతంలోఇన్ స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్ట‌మ్ ల ఏర్పాటు పూర్త‌యింది. ర‌న్ వే పెయింగ్, క్యాలిబరేష‌న్ టెస్ట్ లు ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేసి...కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ర‌న్ వేను అందుబాటులోకి తేనున్నారు. నాల్గ‌వ ర‌న్ వే అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ విమానాశ్ర‌యం నుంచి 14 కోట్ల మంది ప్ర‌యాణికులు రాక‌పోక‌లు సాగించే అవ‌కాశం ల‌బించ‌నుంది. క‌రోనా కు ముందు అంటే 2019లో ఐజీఏ విమానాశ్ర‌యం దేశీయ‌, అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌ను క‌లుపుకుని 6.9 కోట్ల మంది ప్ర‌యాణికుల‌ను హ్యాండిల్ చేసింది.

అంటే ఈ సంఖ్య‌తో పోలిస్తే నాల్గ‌వ ర‌న్ వే అందుబాటులోకి వ‌చ్చాక ప్ర‌యాణికుల హ్యాండ్లింగ్ సామ‌ర్ధ్యం రెట్టింపు కానుంది. అయితే దీనికి ఎన్నో జాగ్ర‌త్త‌తో విమానాల ట్రాపిక్ నిర్వ‌హ‌ణ‌తో పాటు ఎన్నో కొత్త భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. అత్యంత కీల‌క‌మైన ఎయిర్ ట్రాపిక్ కంట్రోల‌ర్స్ (ఏటీసీవో) కొర‌త ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. దేశంలో కొత్త విమానాశ్ర‌యాలు వ‌స్తుండ‌టంతో పాటు దేశంలోనే అత్య‌ధిక ర‌ద్దీ ఉంటే..అతి పెద్ద‌దైన ఐజీఏలో ట్రాఫిక్ నిర్వ‌హ‌ణ‌కు ఎంతో అనుభ‌వం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్స్ కావాల్సిన ఉంద‌న్నారు. దేశంలో ట్రాఫిక్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ల‌ను ఆధునికీక‌రించేందుకు కూడా కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఢిల్లీ విమానాశ్ర‌యాన్ని జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఏఏఐకు కూడా 26 శాతం వాటా ఉంది.

Next Story
Share it