ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్
ఢిల్లీ సర్కారులో కలకలం. హవాలా కేసులో ఏకంగా ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. కోల్ కతాకు చెందిన కంపెనీతో ఆయన హవాలా లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత కొంత కాలంగా సత్యేంద్ర జైన్ కు ఆ కంపెనీతో హవాలా లావాదేవీలు నడుపుతున్నట్లు ఈడీ అధికారుల చెబుతున్నారు. గత నెలలో ఈడీ సత్యేంద్ర జైన్ కుటుంబంతో పాటు ఆయనకు సన్నిహితులైన వారి కంపెనీలు చెందిన 4.81 కోట్ల రూపాయల ఆస్తులను ఎటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు ఏకంగా మంత్రిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ తరహాలోనే మహారాష్ట్రలోనూ మంత్రులు పలు కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మంత్రి అరెస్ట్ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే పంజాబ్ లో అవినీతి ఆరోపణలతో ఏకంగా కేబినెట్ మంత్రిపై వేటు వేయటమే కాకుండా..కేసు పెట్టి అరెస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం అయితే రాజకీయ కారణాలతోనే కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడుతోంది.