ఢిల్లీలో ఆంక్షలు సడలింపు
BY Admin4 Feb 2022 4:41 PM IST

X
Admin4 Feb 2022 4:41 PM IST
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షల సడలింపు ప్రారంభం అయింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పలు సడలింపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సర్కారు కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి అంటే ఫిబ్రవరి 7 నుంచి పాఠశాలలు, కాలేజీలు, జిమ్స్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో రాత్రి కర్ఫ్యూను కూడా ఓ గంట కుదించారు. సోమవారం నుంచి రాత్రి నుంచి కర్ఫ్యూ పదకొండు గంటల నుంచి ఐదు గంటలకు తగ్గించారు. ఢిల్లీలోని కార్యాలయాలు వంద శాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు.
Next Story



