Telugu Gateway
Top Stories

సిసోడియా కూడా ఇన్ ...ఇక నెక్స్ట్ ఎవరు?!

సిసోడియా కూడా ఇన్ ...ఇక నెక్స్ట్ ఎవరు?!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కీలక అరెస్ట్ జరిగింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ను సిబిఐ అధికారులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. గతం లో పలు మార్లు మనీష్ సిసోడియా ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు..అయన నివాసాల్లో తనిఖీలు కూడా చేశారు.కానీ వాళ్లకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సిసోడియా పలు మార్లు చెప్పారు. ఇప్పడు మరో సారి నోటీసులు ఇచ్చి ఆదివారం నాడు విచారించిన తర్వాత మనీష్ సిసోడియా ను అరెస్ట్ చేసినట్లు సిబిఐ ప్రకటించింది. అయితే ఈ విషయాన్నీ మనీష్ సిసోడియా కూడా ముందే పసిగట్టారు. విచారణకు పోయే ముందే అయన అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించటం విశేషం. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్ నుంచి ఢిల్లీ లోని అప్ పార్టీ పెద్దలకు వంద కోట్ల రూపాయల ముడుపులు చేరాయని విచారణ సంస్థలు తేల్చాయి. దీంతో పాటు ఆధారాలు దొరకకుండా ఫోన్లను నాశనం చేయటం..పదే పదే నంబర్లు మార్చటం వంటి పనులు చేసినట్లు గుర్తించారు.

ఈ విషయాలను ఇప్పటికే చార్జిషీట్ లో ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కారణంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు 2500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ సర్కారు తమకు కావాల్సిన వాళ్ళకే లిక్కర్ జోన్లు దక్కేలా ప్లాన్ చేసింది అని..దీనికి సంబంధించి హైదరాబాద్ తో పాటు ఢిల్లీ లో కూడా పలు మార్లు సమావేశాలు జరిగాయని తేల్చారు. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని విచారిస్తున్న సిబిఐ కార్యాలయం వద్ద భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు.ముందు నుంచి ఉహించినట్లే సిసోడియా అరెస్ట్ జరిగింది. ఇప్పటి వరకు పెద్దగా ఆధారాలు దొరకని మనీష్ సిసోడియా నే అరెస్ట్ చేసారు అంటే ..ఇక ఇందులో ఎవరని వదిలే ఛాన్స్ లేవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుతోంది.ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత సిసోడియా అరెస్ట్ ప్రకటించారు

Next Story
Share it