Telugu Gateway
Top Stories

స్పైస్ జెట్ విమానంలో మంట‌లు..త‌ప్పిన ప్ర‌మాదం

స్పైస్ జెట్ విమానంలో మంట‌లు..త‌ప్పిన ప్ర‌మాదం
X

స్పైస్ జెట్ విమానం పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డింది. టేకాప్ అయిన కొద్దిసేప‌టికే ఇంజ‌న్ లో మంట‌లు వ‌చ్చాయి. ఎడమ ఇంజిన్ భాగంలో ఓ పక్షి ఢీకొట్ట‌డంతో మంట‌లు చెల‌రేగాయి. విష‌యాన్ని గుర్తించిన ప్ర‌యాణికులు కూడా వెంట‌నే సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. దీంతో అప్ర‌మ‌త్తం అయిన పైలట్లు అత్య‌వ‌స‌రంగా విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేశారు. పాట్నా నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరి విమానంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

పైల‌ట్లు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి విమానాన్ని వెంట‌నే ల్యాండ్ చేయ‌టంతో వెంట‌నే ఫైరింజ‌న్లు వ‌చ్చి మంట‌ల‌ను ఆర్పేశాయి. దీంతో ప్ర‌యాణికులు అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. డీజీసీఏ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించింది. ప్ర‌మాదానికి కార‌ణం ప‌క్షి ఢీకొట్ట‌డ‌మే అని తేల్చారు. ఈ విమానంలో ఏకంగా 185 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.

Next Story
Share it