Telugu Gateway
Top Stories

ఎనిమిది గంటలుగా విమానాశ్రయంలో

ఎనిమిది గంటలుగా విమానాశ్రయంలో
X

విమాన ప్రయాణికులకు కరోనా కష్టాలు తప్పట్లేదు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎనిమిది గంటల పాటు ప్రయాణికులు కరోనా టెస్ట్ ల ఫలితాల కోసం వేచిచూడాల్సి వస్తోంది. యూకెలో కొత్తగా వెలుగుచూసిన వైరస్ కారణంగా ప్రయాణికులకు ఖచ్చితంగా పరీక్ష నిర్వహించిన తర్వాతే బయటకు పంపుతున్నారు. మంగళవారం రాత్రి దిల్లీకి చేరుకున్న వారు తమ కోవిడ్ రిపోర్టుల కోసం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేచిచూడాల్సి వచ్చింది.

ఈ కారణంగా ఏకంగా 500 మంది విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ముఖ్యంగా యూకె నుంచి వచ్చిన వారిని పరీక్షలు చేసిన తర్వాతే బయటకు పంపాలనే నిబంధనలు ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బ్రిటన్ కు భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేశారు. ఏకంగా 40 దేశాలు ఇదే బాట పట్టాయి. అయితే విమానాశ్రయం లోపల కూడా భౌతిక దూరం నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని విమర్శలు ఉన్నాయి.

Next Story
Share it