Telugu Gateway
Top Stories

వీడియో మీది...మొఖం ఎవరిదో

వీడియో మీది...మొఖం ఎవరిదో
X

ఫేక్ న్యూస్. ఫేక్ ...మార్ఫింగ్ వీడియో లతోనే ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్ప్పుడు వీటి అన్నింటిని మించిన తరహాలో డీప్ ఫేక్ వీడియో కాన్సెప్ట్ కలకలం రేపుతోంది. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఐఏ) ఓ పెద్ద సంచలనం. ఐటి రంగంలో సమూల మార్పులకు ఇది ఎంతో కీలకంగా మారబోతుంది. ఐఏను ఉపయోగించి మానవవనరులు కూడా తగ్గించే వెసులుబాటు దీని ద్వారా రానుంది. ప్రతి టెక్నాలజీ వల్ల మంచితో పాటు ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి అని చూసే వాళ్ళ కోణమే ముఖ్యం ఇక్కడ. ఏఐ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియో లు తయారు చేసే టెక్నాలజీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. దీంతో ఇప్పటికే సమస్యలు సృష్టిస్తున్న ఫేక్ వీడియో ల బెడద రాబోయే రోజుల్లో మరింత పెరగనుంది. ఒక వ్యక్తి వీడియో చేస్తూ దానికి ఎవరి పేస్ ను అయినా చాలా ఈజీగా జోడించవచ్చు. ఒకప్పుడు దీనికి మార్ఫింగ్ టెక్నాలజీ వాడేవారు. ఇప్పుడు డీప్ ఫేక్ టెక్నాలజీ వాడుతున్నారు.

ఒక యువకుడు ఇప్పుడు ఇదే టెక్నాలజీ వాడుతూ ఒక వీడియో చేశాడు. అందులో తన పేస్ ఒక సారి ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ గా, మరో సారి ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ గా, మరోసారి సల్మాన్ ఖాన్ ముఖంతో వచ్చింది. ఇలాంటి వాటి విషయం లో అసలు ఏది నిజం ఏది ఫేక్ అని కనిపెట్టడం కూడా చాలా కష్టం. ముఖ్యంగా వీటి బారిన సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారటంతో దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఇది ప్రమాదకర పరిస్థితులకు సంకేతంగా అయన అభివర్ణించారు. ఇది చూడటానికి కాసేపు సరదాగా ఉండొచ్చు కానీ...టెక్నాలజీ దుర్వినియోగం అయితే ఇబ్బందులు తప్పవన్నారు. భవిష్యతులో రాబోయే ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవటానికి మనం ఎంత సమయాత్తంగా ఉన్నామో చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.

.

Next Story
Share it