Telugu Gateway
Top Stories

భార‌త్ లోకి అమెరికా వ్యాక్సిన్ వ‌స్తోంది

భార‌త్ లోకి అమెరికా వ్యాక్సిన్ వ‌స్తోంది
X

దేశంలో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మ‌రింత ఊపందుకోనుంది. ఇప్ప‌టికే దేశంలో మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండ‌గా..ఇప్పుడు నాల‌గ‌వ వ్యాక్సిన్ కూడా రానుంది. అదే అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్. మంగ‌ళ‌వారం నాడు భార‌త్ కు చెందిన డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మోడెర్నా వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి మంజూరు చేసింది. ప్ర‌ముఖ ఫార్మా సంస్థ సిప్లా ఈ వ్యాక్సిన్ల‌ను దిగుమ‌తి చేసుకుని భార‌త్ లో స‌రఫ‌రా చేయ‌నుంది. విదేశీ వ్యాక్సిన్ల‌కు అనుమ‌తించే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తామ‌ని కేంద్రం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

అందులో భాగంగానే మోడెర్నాకు లైన్ క్లియ‌ర్ అయింది. డెర్నావ్యాక్సిన్‌ దిగుమతికి అనుమతిని కోరుతూ డీసీజీఐకి సిప్లా కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది. 90 శాతం సమర్ధతను కలిగి ఉన్న రెండు డోసుల మోడర్నా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి కెనడా, అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో అనుమ‌తి ల‌భించింది. దీంతో భార‌త్ లో ఎలాంటి ప్రయోగాలు లేకుండా నేరుగా అనుమ‌తి ఇవ్వ‌టానికి ఆమోదించారు.

Next Story
Share it