Telugu Gateway
Top Stories

టీలు తాగ‌టం త‌గ్గించుకోండి బాబులూ!

టీలు తాగ‌టం త‌గ్గించుకోండి బాబులూ!
X

తెలుగులో టీ..హిందీలో చాయ్. ఏ ఇద్ద‌రు క‌లిసినా వెంట‌నే చేసే ప‌ని క‌బుర్ల చెప్పుకుంటూ చాయ్ తాగ‌టం. భార‌త్ లో ఈ అల‌వాటు లేని వారు చాలా అరుదే అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఓ దేశం చాయ్ తాగ‌టం త‌గ్గించుకోవాల‌ని చెబుతోంది. ఇదేదో ఆరోగ్య‌ప‌రంగా చెబుతున్న జాత్ర‌త్త‌లు కాదు. అప్పు చేసి మ‌రీ టీ పొడి దిగుమ‌తి చేసుకుంటున్నామ‌ని..ప్ర‌తి రోజూ తాగే టీలో కొంత కోత పెట్టుకోమ‌ని పాకిస్తాన్ మంత్రి అస‌న్ ఇక్బాల్ ఆ దేశ ప్ర‌జ‌ల‌ను కోరారు. దేశంలో ఇప్పుడు దిగుమ‌తుల బిల్లు భారీగా పెరిగిపోయింద‌ని వాపోయారు. అందుకే దేశంలోని ప్ర‌జ‌లంద‌రూ టీ తాగ‌టం ఒక‌టి..రెండు క‌ప్పుల‌కు ప‌రిమితం చేసుకోవాల‌ని విన్న‌వించారు. ప్ర‌పంచంలోనే పాకిస్థాన్ అతిపెద్ద టీ దిగుమ‌తిదారుగా ఉంది.

Next Story
Share it