Telugu Gateway
Top Stories

బిల్లు పదిహేను వేలు..టిప్ 3.68 లక్షలు

బిల్లు పదిహేను వేలు..టిప్ 3.68 లక్షలు
X

స్టార్ హోటల్ నుంచి ఓ మోస్తరు హోటళ్ళలో 'టిప్' ఇవ్వటం అన్నది మామూలే. కానీ ఈ టిప్ లో ఓ హైలెట్ ఉంది. రెస్టారెంట్ లో అయిన బిల్లు కంటే టిప్ లక్షల్లో ఉండటంతో ఆ హోటల్ నిర్వాహకులు కూడా అవాక్కు అయ్యారు. అయితే ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ రెస్టారెంట్ లో కస్టమర్ తన 15,170 రూపాయల బిల్లుకు గాను ఓ సేవకురాలు (వెయిట్రెస్)కు ఏకంగా 3.68 లక్షల రూపాయలు టిప్ గా ఇచ్చేసి వెళ్లిపోయారు. అమెరికాలో కరోనా స్వైరవిహారం చేస్తున్న తరుణంలో ఈ టిప్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఈ టిప్ అంశాన్ని రెస్టారెంట్ యాజమాన్యమే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ థ్యాంక్యూ..థ్యాంక్యూ..ఇంతకు మించి ఏమి చెప్పగలం అంటూ రాసింది. ఈ టిప్ ద్వారా తమ సిబ్బంది హాలిడేస్ ను పూర్తి చేసుకుంటారని పేర్కొంది. ఈ భారీ టిప్ అందుకున్న వెయిట్రెస్ ఆ రెస్టారెంట్ లో కొత్తగా చేరింది. ఆమె నర్సింగ్ చదువుతోందని తెలిపారు. ఆ ఆసక్తికర కథనాన్ని ఏబీసీ కథనాన్ని ఉటంకిస్తూ ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించింది. కరోనా కష్ట సమయంలో ఇంత ఉదారత చూపిన కస్టమర్ ను నెటిజన్లు ప్రశంశిస్తున్నారు.

Next Story
Share it