క్రెడిట్ కార్డు లావాదేవీల కొత్త రికార్డు
ఒక్కో క్రెడిట్ కార్డు పై సగటున చేసే వ్యయం కూడా రికార్డు స్థాయిలో 16144 రూపాయలకు పెరిగింది అని ఆర్ బి ఐ వెల్లడించింది. 2023 మార్చి తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలలో క్రెడిట్ కార్డు ల ద్వారా చేసిన వ్యయం గరిష్టంగా 1 . 2 లక్షల కోట్ల రూపాయలు ఉండగా..ఇప్పుడు అది రికార్డు స్థాయిలో 1 . 4 లక్షల కోట్ల కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి అదనంగా 50 లక్షల కార్డు లు పెరిగి అవి 8 .7 కోట్లను దాటాయి. ఆస్తుల నాణ్యత పరంగా చూసుకుంటే...అంటే క్రెడిట్ కార్డు ల ద్వారా ఖర్చు పెట్టిన మొత్తాల తిరిగి చెల్లింపులు 90 రోజులు దాటినవి సుమారు మూడు శాతం వరకు ఉన్నాయి. అంతకు ముందు ఏడాది కంటే ఇది 0 .66 శాతం మేర పెరిగినట్లు ఆర్ బి ఐ నివేదిక వెల్లడించింది.