Telugu Gateway
Top Stories

కోవిషీల్డ్ కు యూరోపియ‌న్ దేశాలు గ్రీన్ సిగ్న‌ల్

కోవిషీల్డ్ కు  యూరోపియ‌న్ దేశాలు గ్రీన్ సిగ్న‌ల్
X

భార‌త్ దెబ్బ‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు దారికొచ్చాయి. మీరు ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే మేం కూడా మీ విష‌యంలో అలాగే ఉంటామంటూ వార్నింగ్ ఇవ్వ‌టంతో యూరోపియ‌న్ కు చెందిన ప‌లు దేశాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను గ్రీన్ పాస్ జాబితాల చేర్చాయి. దీంతో కొద్ది రోజుల క్రితం త‌లెత్తిన స‌మ‌స్య ప‌రిష్కారం అయిన‌ట్లు అయింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చాయి. కొవిషీల్డ్‌ పేరును అప్రూవ్డ్‌ వ్యాక్సిన్ల లిస్ట్‌లో చేర్చినట్లు హడావిడిగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్‌తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్‌, ఐల్యాండ్‌,, ఐర్లాండ్‌, స్పెయిన్‌, దేశాలు కొవిషీల్డ్‌ను అంగీకరించాయి.

దీంతో ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్‌ తీసుకున్న భారత ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. తమ వ్యాక్సిన్‌ల(కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌) డిజిటల్‌ సర్టిఫికేట్‌ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్‌లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్‌ నిబంధనలను అమలు చేస్తామని భారత్‌ హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్‌కు అనుమతి ఇవ్వడం విశేషం. భార‌త్ బయోటెక్ డెవ‌ల‌ప్ చేసిన కోవాగ్జిన్ కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ వో) అత్య‌వ‌స‌ర వినియోగ జాబితా (ఈయూఎల్)లో పేరు లేక‌పోవ‌టంతో ప‌లు దేశాన్ని ఈ వ్యాక్సిన్ ను ఇంకా గుర్తించ‌టం లేదు. భార‌త్ బ‌యోటెక్ సంబంధిత ప‌త్రాల‌కు స‌మ‌ర్పించ‌టంతో త్వ‌ర‌లోనే అనుమ‌తి వ‌స్తుంద‌ని అంచ‌నాతో భార‌త్ బ‌యోటెక్ ఉంది.

Next Story
Share it