Telugu Gateway
Top Stories

కరోనా రెండవ దశ తగ్గుముఖం ప్రారంభం

కరోనా రెండవ దశ తగ్గుముఖం ప్రారంభం
X

నిపుణులు చెబుతున్నట్లే జరుగుతోంది.. కరోనా రెండవ దశ కేసుల్లో తగ్గుదల ప్రారంభం అయినట్లే కన్పిస్తోంది. వరస పెట్టి విడుదల అవుతున్న గణాంకాలు ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. మే నెలాఖరు నాటికి కరోనా రెండవ దశ గణనీయంగా తగ్గుతుందనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. దాని ప్రకారమే కేసుల్లో తగ్గుదల నమోదు అవుతూ వస్తోంది. అయితే అందోళన కర పరిణమాం ఏమిటంటే గతంతో పోలిస్తే మరణాలు సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 2,63,533 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఒకే రోజు 4,329 మంది మృత్యువాతపడ్డారు. ఇంత భారీ స్థాయిలో మరణాలు నమోదు కావటం ఇదే మొదటిసారి. సోమవారం 4,22,436 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్రావైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 2,52,28,996 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 2,78,719 మంది మృతిచెందారు. 2,15,96,512 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 33,53,765 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 18,69,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 31,82,92,881 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Next Story
Share it