Telugu Gateway
Top Stories

ఎలన్ మస్క్..రెండు పాజిటివ్..రెండు నెగిటివ్

ఎలన్ మస్క్..రెండు పాజిటివ్..రెండు నెగిటివ్
X

ఎలన్ మస్క్. అమెరికాకు చెందిన బిలియనీర్ పారిశ్రామికవేత్త. స్పేస్ ఎక్స్, టెస్లా ఐఎన్ సీల సీఈవో. అలాంటి వ్యక్తికే విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆయన తాజాగా ఒకే చోట నాలుగుసార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆ నాలుగు టెస్ట్ ల్లో రెండు పాజిటివ్ రాగా, రెండు నెగిటివ్ అని వచ్చాయి. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. ఏదో సీరియస్ బోగస్ వ్యవహారం సాగుతోంది.

సేమ్ మెషిన్, సేమ్ టెస్ట్, సేమ్ నర్స్. నాలుగుసార్లు టెస్ట్ లు చేయించుకుంటే రెండుసార్లు నెగిటివ్, రెండుసార్లు పాజిటివ్ అని వచ్చింది. బిడి సంస్థకు చెందిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ల్లో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. మస్క్ ట్వీట్ పై స్పందించిన ఓ వ్యక్తి ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయా అని ప్రశ్నించగా జలుబు తప్ప అసాధారణ లక్షణాలు ఏమీ లేవని తెలిపారు.

Next Story
Share it