Telugu Gateway
Top Stories

మార్చి 31 నుంచి కోవిడ్ నిబంధ‌న‌ల‌కు గుడ్ బై

మార్చి 31 నుంచి కోవిడ్ నిబంధ‌న‌ల‌కు గుడ్ బై
X

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌టంతో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ 19 కు సంబంధించి ఇక డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్(డీఎం) చ‌ట్టాన్ని ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మార్చి 31 నుంచే ఇది అమ‌ల్లోకి రానుంది. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎస్ ల‌కు లేఖ‌లు రాశారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసే మార్గ‌ద‌ర్శ‌కాలను ఎప్ప‌టిక‌ప్పుడు అమ‌లు చేయాల‌న్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్క్‌ ధరించాల్సి ఉంటుందని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం కేంద్రం తీసుకున్న కోవిడ్‌ రూల్స్‌ మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలోని రోజువారీ పాజిటివ్‌ కేసులు కనిష్ట స్థాయిలో నమోదు అవుతుండటంతో ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు కోవిడ్‌ నిబంధనలను సడలించాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో భద్రతా చర‍్యల కోసం కేంద్రం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేంద్రం కొవిడ్‌ రూల్స్‌ విధించిందిన విషయం తెలిసిందే.అయితే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీ నుంచి అన్ని నిబంధనలను తొలగిస్తున్నట్టు బుధవారం కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది.

Next Story
Share it