కరోనా కేసులు తగ్గాయి..మరణాలు పెరిగాయి
రెండవ దశ కరోనాలో ఊహించని స్థాయిలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కేసులు కూడా ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో భారత్ లోనే కొత్త కొత్త రికార్డులు నమోదు చేసిన విషయం తెలసిందే. శనివారం నాడు దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదు అయినా..మరణాలు మాత్రం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,11,170 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,077 మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 3,62,437 మంది బాధితులు కోలుకున్నారు.
దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,46,84,077 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 36,18,458 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోన నుండి ఇప్పటి వరకు 2,07,95,335 మంది బాధితులు కోలుకున్నారు. అదే సమయంలో కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,70,284 కి పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 84.25 శాతం ఉండగా, మరణాల రేటు 1.09 శాతంగా నమోదు అయింది. ఇప్పటివరకు 18,22,20,164 మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు.