Telugu Gateway
Top Stories

సెప్టెంబర్ కు కోవాగ్జిన్ కు డబ్ల్యూహెచ్ వో ఆమోదం

సెప్టెంబర్ కు కోవాగ్జిన్ కు డబ్ల్యూహెచ్ వో  ఆమోదం
X

ఈ ఏడాది జులై-సెప్టెంబర్ నాటికి తమ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆమోదం లభించే అవకాశం ఉందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. డబ్ల్యూహెచ్ వో అత్యవసర వినియోగ లిస్టింగ్ ప్రక్రియ పూర్తయితేనే పలు దేశాల్లో ఈ వ్యాక్సిన్ కు గుర్తింపు వస్తుంది. అప్పుడే ఆయా దేశాల్లో ఉన్న నిబంధనల ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు పర్యటనలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.గత కొన్ని రోజులుగా డబ్ల్యూహెచ్ వో లిస్టింగ్ లో కోవాగ్జిన్ లేని కారణంగా ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారి విదేశీ ప్రయాణాలకు ఇబ్బందులు ఎదురుకానున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

. ఈ తరుణంలో కంపెనీ దీనికి సంబంధించి పలు అంశాలపై వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే అమెరికా, బ్రెజిల్, హంగరీతోపాటు మొత్తం అరవైకిపైగా దేశాల్లో నియంత్రణా సంస్థల అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 13 దేశాల్లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి (ఈయుఏ) పొందినట్లు వెల్లడించారు. డబ్ల్యూహెచ్ వోకు ఈయూఎ కోసం దరఖాస్తు చేశామని..జులై-సెప్టెంబర్ నాటికి దీనికి సంబంధించిన అనుమతులు వస్తాయని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అసలు వ్యాక్సిన్ వేయించుకోని ప్రయాణికులు కూడా పలు దేశాలకు ఆర్ టీ పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ తో ప్రయాణించవచ్చని పేర్కొంది. ఆయా దేశాల్లో ప్రత్యేకమైన నిబంధనలు ఉంటే తప్ప..ఇది సరిపోతుందని తెలిపింది.

Next Story
Share it