Telugu Gateway
Top Stories

కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై ఆంటోనీ పౌచీ కీలక వ్యాఖ్యలు

కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై ఆంటోనీ పౌచీ కీలక వ్యాఖ్యలు
X

అంటోనీ పౌచీ. అమెరికాలోని అంటువ్యాధుల నిపుణుడు. అంతే కాదు..డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఆయన వైట్ హౌస్ ఏర్పాటు చేసిన కమిటీలో కీలక సభ్యుడు. అమెరికాలో కరోనా విలయతాండవం చేసిన సమయంలో ట్రంప్ విధానాలను, ప్రజలు మాస్క్ లు పెట్టుకోకుండా బయట తిరగటాన్ని కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికాలో వ్యాక్సిన్ల తయారీ విషయంలో కూడా ఆయన తన వంతు పాత్ర పోషించారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కూడా వైద్య సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా తెలంగాణకు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఇండియాలో రోజూ కరోనా సోకుతున్న వారి డాటాను పరిశీలిస్తున్నాం. కోవాగ్జిన్‌ కారణంగా ఇటీవల కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు గుర్తించాం. సేకండ్‌ వేవ్‌కు చెక్‌ పెట్టాలంటే వ్యాక్సిన్లు తప్పని సరిగా వేయించుకోవాలి'' అని ఆంథోనీ ఫౌసీ చెప్పినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది.617 కరోనా రకాన్ని కూడా కోవాగ్జిన్ సమర్ధవంతంగా ఎధుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు.

మహారాష్ట్ర, ఢిల్లీలలో నమోదైన కరోనా కేసుల్లో కనిపించే 617 వేరియంట్‌లో మూడు కొత్త స్పైక్ ప్రోటీన్లు ఉన్నట్లు తేలింది. కోవాగ్జిన్‌ను వినియోగించడం ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ పెరిగి, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తయారు చేస్తుందని తెలిపారు. ఆ ప్రతిరోధకాలు శరీర కణాజాలంలో ఎక్కడో ఓ చోట దాక్కున్న వైరస్‌ని గుర్తించి, దాన్ని నాశనం చేస్తుంది అని నిపుణులు వెల్లడించారు. భారత్ లో నెలకొన్న పరిస్థితులపై ఆంటోనీ పౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో అల్లోకల్లోలం అవుతున్న భారత్ కు సహకరించటంలో సంపన్న దేశాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రపంచ సమస్యగా మారిన కరోనాను ఎదుర్కొవటానికి అంతర్జాతీయంగా అందరూ కలసి సాగాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story
Share it