Telugu Gateway
Top Stories

చిన్న పిల్ల‌ల‌కూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ రెడీ

చిన్న పిల్ల‌ల‌కూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ రెడీ
X

భార‌త్ బ‌యోటెక్ మ‌రో కీల‌క అడుగు వేసింది. ఈ సంస్థ డెవ‌ల‌ప్ చేసిన చిన్న పిల్ల‌ల వ్యాక్సిన్ కు కేంద్రానికి చెందిన నిపుణుల క‌మిటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు వారిపై కోవాగ్జిన్‌ 2,3వ దశ ట్రయల్స్‌ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్‌ బయోటెక్‌. ఇటీవలే రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల వ్యాక్సిన్‌ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు.

ఈ నేపథ్యంలో ''పూర్తి చర్చల అనంతరం ఈ కమిటీ 2-18 ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కింద కోవాగ్జిన్‌ ఇచ్చేందుకుభారత్‌ బయోటెక్‌ కంపెనీకి అనుమతులిచ్చాం" అని సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనిపై కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌ట‌మే త‌రువాయి దేశంలో చిన్న పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు అవుతుంది. దేశంలో అందుబాటులోకి వ‌చ్చిన తొలి చిన్న పిల్ల‌ల వ్యాక్సిన్ కూడా ఇదే అవుతుంది.

Next Story
Share it