అమెరికాలోనూ కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్

దేశీయంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ అమెరికాలోనూ క్లినికల్ ట్రయల్స్ కు రెడీ అయింది. కంపెనీ ఇప్పటికే వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా అమెరికాకు ఎఫ్ డిఏ తిరస్కరించిన విషయం తెలిసిందే. అదే సమయంలో పూర్తి స్థాయి అనుమతి కోసం బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బిఎల్ఏ0కు దరఖాస్తు చేసుకోమని..అందుకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించింది. దీంతో భాగస్వామ్య సంస్థ ఆక్యుజెన్ తో కలసి అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ చేయనున్నారు. అయితే ఇది ఎక్కడ నిర్వహిస్తారు..ఎంత మందిపై అన్న వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
అమెరికాతో పాటు కెనడాలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ మార్కెటింగ్ బాధ్యతలను ఆక్యుజెన్ తీసుకుంది. దీంతో త్వరలోనే కెనడాలోనూ అనుమతుల కోసం దరఖాస్తతు చేయనుంది ఈ సంస్థ. ఇప్పటికే భారత్ బయోటెక్ 14 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతులు దక్కించుకున్న విషయం తెలిసిందే. మరిన్ని దేశాల్లో అనుమతుల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కంపెనీ ఇటీవలే వెల్లడించింది.