Telugu Gateway
Top Stories

విమానంలో ముద్దులు..దుప్పటి ఇచ్చిన ఎయిర్ హోస్టెస్

విమానంలో ముద్దులు..దుప్పటి ఇచ్చిన ఎయిర్ హోస్టెస్
X

విమానంలో ప్రయాణించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. అందులో ముఖ్యమైనది పక్కన ఉండే ప్రయాణికులకు అలాంటి అసౌకర్యం కల్పించకూడదు. అదే సమయంలో విమాన సిబ్బంది మాటలను ఖచ్చితంగా ఫాలోకావాలి. కానీ ఇక్కడ జరిగింది మాత్రం వేరు. అందరూ ప్రయాణిస్తున్న విమానంలోనే వాళ్ళు రొమాన్స్ మొదలుపెట్టారు. అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్నారు. ఇది చూసిన హోయిర్ హోస్టెస్ కాస్త మీ రొమాన్స్ ఆపండి అని చెప్పింది ఆ దంపతులకు. అయినా సరే వాళ్లు వినలేదు. ఇక లాభం లేదు అనుకుని ఎయిర్ హోస్టెస్ ఓ దుప్పటి తెచ్చి ఇచ్చింది.

ఇది అంతా ఎక్కడ అంటారా? పాకిస్తాన్ లోని ఎయిర్ బ్లూ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరాచీ-ఇస్లామాబాద్ విమానంలో ఈ వ్యవహారం నడిచింది. ఇది అంతా చూసిన ఓ అడ్వకేట్ పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. ఈ పిర్యాదులో ఆ జంట ఎయిర్ హోస్టెస్ ఎంత చెప్పినా విన్పించుకోలేదని..అయితే తర్వాత ఎయిర్ హోస్టెస్ వాళ్లకు దుప్పటి సరఫరా చేసిందని పేర్కొన్నారు.. ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే అధికారులు మాత్రం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించారు.

Next Story
Share it