Telugu Gateway
Top Stories

ప్రయాణికుల కోసం అతి పెద్ద లాంజ్|

ప్రయాణికుల కోసం అతి పెద్ద లాంజ్|
X

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవలే రెండు కొత్త రికార్డులు నమోదు చేసింది. దేశంలోనే నాల్గవ రన్ వే ఉన్న ఏకైక విమానాశ్రయం ఇదే. దీంతో పాటు దేశంలోనే తొలిసారి ఇక్కడే ఎలివేటెడ్ క్రాస్ టాక్సీ వే కూడా అందుబాటులోకి వచ్చింది. తాజాగా జీఎంఆర్ నిర్వహణలో ఉన్న ఈ విమానాశ్రయం మరో రికార్డు నమోదు చేసింది. విమానాశ్రయంలోని టెర్మినల్ త్రీ లో ఏకంగా ముప్పై వేల చదరపు అడుగుల్లో లాంజ్ ను డెవలప్ చేశారు. దేశంలోనే అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ లాంజ్ బిజినెస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

తొలుత 22 వేల చదరపు అడుగుల్లో అందుబాటులోకి వచ్చిన లాంజ్...పూర్తి స్థాయిలో రెడీ అయితే ముప్పై వేల చదరపు అడుగులకు చేరుతుంది. దీంతో బిజీ సమయాల్లో ప్రయాణికులు ఈ లాంజ్ లో సమయాన్ని గడిపేలా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. పిల్లల గేమింగ్ జోన్ తో పాటు బార్, లైవ్ ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి రోజుకు 1500 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 2000 కు చేరే అవకాశం ఉంది.

Next Story
Share it