Telugu Gateway
Top Stories

భారత్ లో ఎప్పటినుంచో ఉన్న బీఎఫ్ 7 కేసులు ..ఇప్పుడు హడావుడి ఏంటో?!

భారత్ లో ఎప్పటినుంచో ఉన్న బీఎఫ్ 7 కేసులు ..ఇప్పుడు హడావుడి ఏంటో?!
X

పార్లమెంట్ వేదికగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఒక ప్రకటన చేశారు. భారత్ లో ఈ జులై -నవంబర్ మధ్య కాలంలో నాలుగు బీఎఫ్ 7 కేసులు నమోదు అయ్యాయి అని. అంటే చైనా, అమెరికా తోపాటు ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరగక ముందు నుంచే మన దగ్గర అంటే భారత్ లో ఈ వేరియంట్ కేసులు ఉన్నట్లు లెక్క. ఇదే మాట కేంద్రమే పార్లమెంట్ వేదికగా చెపుతోంది. అలాంటి అప్పుడు ఇప్పుడు కొత్తగా దేశ ప్రజలను ఇంతగా ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం ఏమి ఉంది అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఇతర దేశాల్లో ఉన్న వేరియంట్ భారత్ లో కూడా ఉంది. కానీ ఇప్పటివరకు దేశంలో పెద్దగా కేసులు పెరుగుతున్న దాఖలాలు లేవు. మరి విదేశాల్లో కొత్తగా వచ్చిన వాటిని చూపించి ఇక్కడ ఇంతా హంగామా అవసరమా అన్న చర్చ సాగుతోంది. ఖచ్చితంగా జాగ్గ్రత్తలు అవసరమే. అందులో ఎలాంటి సందేహం లేదు. దేశం లో లేని..కొత్త వేరియంట్స్ వస్తే ఒకింత ఆందోళన ఉంటుంది.

కాకపోతే కేంద్రమే ఇవి మన దగ్గర ఆల్రెడీ ఉన్నవే అని చెపుతోంది. నిజంగా కేంద్రం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో జాగర్తలు తీసుకుంటే సరిపోతుంది అని కొంత మంది నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటినుంచో ఉన్న వాటితో మరో సారి ప్రజలను భయాందోళనలకు గురిచేయడం సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. iత్వరలోనే నూతన ఏడాది వేడుకలు...తర్వాత సంక్రాతి వంటి పండగలు వస్తున్నాయి. అందుకు ప్రజలు అంతా మాస్క్ లు ధరించి ఎప్పటిలాగా అపప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడు మరో సారి బూస్టర్ డోస్ హడావుడి ప్రారంభం అయింది. ఇంకా ఎవరన్నా రెండవ డోస్ తీసుకోకపోయినా..ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం వెంటనే ప్రికాషన్ డోస్ తీసుకోవాలని చెపుతున్నారు. అయితే అటు కేంద్రం..ఇటు మీడియా హడావుడి చూస్తే మాత్రం ప్రజలు మరింత భయపడే పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it