Telugu Gateway
Top Stories

ఎయిర్ లైన్స్ వెరైటీ నిర్ణయం!

ఎయిర్ లైన్స్ వెరైటీ నిర్ణయం!
X

సినిమాల్లో మాత్రమే ఇప్పటి వరకు మనం పెద్దలకు మాత్రమే అనే ట్యాగ్ లైన్ చూశాం.. అడల్ట్ కంటెంట్ ఉంటే సినిమాలకు ఏ సర్టిఫికెట్ ఇస్తారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక విమానయన సంస్థ కూడా పెద్దలకు మాత్రమే అంటూ విమానాల్లో కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పదహారు సంవత్సరాల వయసు పైబడిన వారు విమానంలో ఎలాంటి పిల్లల గొడవ, ఇతర ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకునే వారికోసం ఇలాంటి ప్రత్యేక సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నట్లు టర్కిష్ లీజర్ ఎయిర్ లైన్ కోరండోన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఈ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ 350 విమానాల్లోని ముందు భాగంలో ఈ ప్రత్యేక సీట్ల ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక గోడ తో పాటు కర్టెన్స్ తో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఈ నవంబర్ నుంచే అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో అమెస్టర్ డాం-కురాకో మార్గంలో ఇది అందుబాటులోకి రానుంది. బిజినెస్ ట్రావెలర్స్, పిల్లలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రయాణించాలి అనుకునే వారికి ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది అని ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

Corendon Airlinesకొన్ని సార్లు విమాన ప్రయాణ సమయంలో చిన్న పిల్లలు బాగా ఏడవటంతో పాటు గొడవలు చేస్తుంటారు అని...ఆ సమయంలో పిల్లల పేరెంట్స్ తో పాటు ఇతర ప్రయాణికులకు కూడా అసౌకర్యం ఉంటుంది. .ఇలాంటి ఇబ్బందులు వద్దు అను కునే వారికి ఈ పెద్దలకు మాత్రమే విభాగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని ప్రకటించారు. ఇతర సీట్ల తో పోలిస్తే ఈ విభాగంలో అదనపు లెగ్ రూమ్ ఉంటుంది. ఈ సీట్లు బుక్ చేసుకునే వారు అందుకు అనుగుణంగా అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. బహుశా విర్మాణాల్లో పెద్దలకు మాత్రమే అంటూ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది ఇదే ఎయిర్ లైన్ కావొచ్చు. ఇప్పటికే ఖతార్ ఎయిర్ లైన్స్ తో పాటు పలు సంస్థలు తమ ఏ 380 విమానాల్లో అపార్ట్ మెంట్ పేరుతో ప్రయాణికులు ఇంట్లో లాగానే నిద్రపోయేలా ప్రత్యేక సీట్లు డిజైన్ చేశాయి.కానీ పెద్దలకు మాత్రమే పేరుతో ఒక ఎయిర్ లైన్ ప్రత్యేక విభాగం తీసుకురావటం ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి.

Next Story
Share it