ఢిల్లీ లో టెన్షన్ టెన్షన్

కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపీ) తన తొలి ప్రయత్నంలోనే ఘన ఘన విజయం సాధించింది. అంతే కాదు సిజెపీ పుట్టుకొచ్చే వరకు దేశంలో అసలు ప్రధాని మోడీని గట్టిగా ప్రశ్నించే పరిస్థితి...సవాల్ చేయగలిగే వాళ్ళు ఎవరూ లేరు అన్న వాతావరణం కొనసాగింది. కాకపోతే సిజేపీ ఎంట్రీతో పరిస్థితి మొత్తం ఒక్కసారి గా మారిపోయింది అనే చెప్పాలి. ఒక్క సిజెపీ అనే కాకుండా దేశంలోని యువత కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం సోషల్ మీడియా నే . నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఢిల్లీ లోని జంతమంతర్ వేదికగా సిజేపీ చేసిన ధర్నా..నిరసన ప్రదర్శనలే దీనికి కారణం అయ్యాయి . ఇప్పుడు జంతర్ మంతర్ 2 .ఓ మొదలు కానుంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఈసి) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
సిఈసి జ్ఞానేష్ కుమార్ కేంద్రంలోని అధికార బీజేపీకి పూర్తిగా సహకరిస్తూ పెద్ద ఎత్తున సర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జాతీయ మీడియాలో దీనికి సంబంధించి వార్తలు వచ్చిన తర్వాత ఈ ఉద్యమం మరింత ఊపు అందుకుంది. ఎన్నికల కమిషన్ లోని మిగిలిన ఇద్దరు సభ్యుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా జ్ఞానేష్ కుమార్ పలు విషయాల్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అనే విషయం ఇప్పుడు సుప్రీం కోర్ట్ పరిధిలోకి వెళ్ళింది. గత కొన్ని రోజులుగా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు అన్నీ ముక్తకంఠంతో జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే డిమాండ్ తో అక్టోబర్ 10 న ఢిల్లీ లోని జంతర్ మంతర్ వేదికగా మరో సారి సిజెపీ భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ లో ఇప్పుడు వాతావరణం టెన్షన్ టెన్షన్ గా మారింది అనే చెప్పాలి. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ పరిధిలో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరింప చేయటంతో పాటు ఇంటర్నెట్ ను కూడా బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కి వచ్చే పలు రైళ్లను రద్దు చేయటంతో పాటు 57 మెట్రో స్టేషన్స్ ను మూసివేయాలని నిర్ణయించారు. వివిధ పనుల కోసం నగరంలో ప్రయాణించే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంఖ్యను తగ్గించాలి అని కోర్ట్ సూచించింది.
అదే సమయంలో అనుమతి లేకుండా నిరసనలు చేయటం చట్టబద్దం కాదు అన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తొలి ప్రయత్నంలో విజయం సాధించిన సిజెపీ మరి ఇప్పుడు సిఈసి జ్ఞానేష్ కుమార్ విషయంలో విజయం సాదించగలదా..ప్రతిపక్షాలతో పాటు సిజెపీ..యువత కోరుతున్నట్లు ఆయన రాజీనామా చేయటం జరిగే పనేనా అన్నది ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. శనివారం నాడు ఢిల్లీ లో జరిగే ధర్నా తర్వాత ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతున్న అంశం అనే చెప్పాలి. ఢిల్లీ పోలీస్ లు సిజెపీ నిరసనలకు అనుమతి లేదు అని చెపుతున్నారు. సిజేపీ మాత్రం తమ నిరసన ప్రదర్శన సమాచారం ఇప్పటికే ఇచ్చాం అని...అనుమతి అవసరం లేదు అని వాదిస్తోంది. మెట్రో స్టేషన్స్ మూసివేత..రైళ్ల బంద్ వంటి పరిణామాలపై కూడా సిజెపీ నేతలు స్పందించారు. మోడీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి..మేము వస్తున్నాం అంటూ అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ లు వ్యాఖ్యానించారు.



