జైపూర్ నిరసన కార్యక్రమంలో ఘటన

గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపీ) పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశంలోని యువత ఈ పార్టీ వైపు పెద్ద ఎత్తున మొగ్గుచూపుతున్నారు. ఇది ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏ మాత్రం మింగుడుపడటం లేదు. సిజెపీ ఇప్పుడు ఒకే ఒక అజెండాతో దేశ వ్యాప్తంగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లీక్ తో పాటు సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ( ఓఎస్ఎం) వివాదానికి సంబంధించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజెపీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్ తో దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే సోమవారం నాడు రాజస్థాన్ లోని జైపూర్ లో సిజెపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది.. గుర్తు తెలియని వ్యక్తులు అభిజీత్ దీప్కే పై దాడికి దిగారు. ముఖ్యంగా ఆయనపై వరసగా చెంప దెబ్బలు కొట్టారు.
కొంత మంది అభిమానులు అభిజీత్ దీప్కే ను తమ భుజాలపై ఎత్తుకుని ఊరిగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వెంటనే అభిజీత్ దీప్కే పై దాడి చేసిన వ్యక్తిపై ర్యాలీ లో పాల్గొన్న వాళ్ళు దాడికి దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. జైపూర్ లోని అమరుల స్మారకం వద్ద సిజెపీ సోమవారం నాడు నిరసన కార్యక్రమం తలపెట్టింది. ఆ సమయంలోనే ఈ దాడి జరిగింది. దాడిపై అభిజిత్ మాట్లాడుతూ



