Telugu Gateway
Top Stories

థియేటర్లలో వంద శాతం సామర్ధ్యానికి ఓకే

థియేటర్లలో వంద శాతం సామర్ధ్యానికి ఓకే
X

టాలీవుడ్ కు శుభవార్త. థియేటర్లు వంద శాతం సామర్ధ్యంతో ఓపెన్ చేసుకోవటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఇక నిర్మాతలకు కాసుల వర్షమే. ప్రస్తుతం కేవలం 50 శాతం సామర్ధ్యంతో మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి వంద శాతం సామర్ధ్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం అభిమానులు థియేటర్లలోనే సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అవటంతోపాటు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అయితే వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తూ గతంలో జారీ చేసిన కరోనా నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. కేంద్రం ఇఛ్చిన వెసులుబాటుతో మల్టీఫ్లెక్స్ లు, థియేటర్లు పూర్తి స్థాయి సామర్ధ్యంతో సీట్లు విక్రయించుకోవచ్చు. థియేటర్ సిబ్బంది, ప్రేక్షకులు ఖచ్చితంగా మాస్క్ ధరించాలనే నిబంధన పెట్టారు. ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. హ్యాండ్ వాష్ తోపాటు , శానిటైజర్లు అందుబాటులో ఉంచటంతోపాటు హాలులో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Next Story
Share it